CI Lingaiah: పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన టాటా ఏస్

  • బందోబస్తు కోసం వెళుతున్న సీఐ లింగయ్య
  • దంతాలపల్లి గ్రామ శివారులో ప్రమాదం
  • టాటా ఏసీ డ్రైవరుకు తీవ్ర గాయాలు
శంషాబాద్‌కు బందోబస్తు కోసం వెళుతున్న పోలీసు వాహనాన్ని టాటా ఏస్ ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. శంకర్‌పల్లి సీఐ లింగయ్య పోలీస్ వాహనంలో శంషాబాద్ బందోబస్తు కోసం వెళుతున్నారు. ఆయన వాహనం శంకర్‌పల్లి మండలం దంతాలపల్లి గ్రామ శివారులోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
CI Lingaiah
shamshabad
Shankarpalli
TATA AC
Accident

More Telugu News