delhi: రేపు ఢిల్లీలో విపక్ష నేతల భేటీ.. హాజరుకానున్న చంద్రబాబు

  • రేపు మధ్యాహ్నం 3.15 గంటలకు జరగనున్న భేటీ
  • హాజరుకానున్న బీజేపీయేతర పార్టీల నేతలు
  • ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చకు ఆస్కారం

ఢిల్లీలో విపక్ష నేతలు భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం 3.15 గంటలకు ఈ భేటీ జరగనుంది. బీజేపీయేతర పార్టీల నేతలు ఈ భేటీలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ హాజరుకానున్న ఈ భేటీకి టీడీపీ అధినేత  చంద్రబాబు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చైర్మన్ ఫరూక్ అబ్దుల్లా, లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టి అధినేత శరద్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్, ఆ పార్టీ అగ్రనేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతితో పాటు డీఎంకే, సీపీఐ, సీపీఎం నేతలు వెళ్లనున్నారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, మోదీ విధానాలపై చర్చ జరగనున్నట్టు సమాచారం. అంతేకాకుండా, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, తెలంగాణలో ప్రజాకూటమి ఏర్పాటు వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం.

More Telugu News