Returning Officer: కూకట్‌పల్లి రిటర్నింగ్ అధికారి పెట్టిన మెసేజ్‌తో కౌంటింగ్ ఏజెంట్లకు చిక్కులు

  • క్రిమినల్ కేసుల్లేవని సర్టిఫికెట్ తీసుకు రావాలి
  • ఏసీపీ దొరకడం లేదంటున్న కౌంటింగ్ ఏజెంట్లు
  • ఎన్నికల అధికారికి టీడీపీ నేతల ఫిర్యాదు

రిటర్నింగ్ అధికారి పెట్టిన మెసేజ్‌తో కౌంటింగ్ ఏజెంట్లు కొత్త చిక్కుల్లో పడ్డారు. తమపై క్రిమినల్ కేసులు లేవని ఏజెంట్లు ఏసీపీ నుంచి ఒక సర్టిఫికెట్ తీసుకురావాలంటూ రిటర్నింగ్ అధికారి మెసేజ్ పెట్టారు. దీంతో కౌంటింగ్ ఏజెంట్లు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఏసీపీ వద్దకు వెళ్లితే ఆయన బిజీగా ఉన్న కారణంగా దొరకడం లేదని వారు చెబుతున్నారు. అయినా ఏజెంట్ల నేర చరిత్రను పరిశీలించవలసిన బాధ్యత ఎన్నికల అధికారులదేనని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయమై ఎన్నికల అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News