చరిత్రకారుడు రామచంద్రగుహను బెదిరించిన మాజీ ‘రా’ ఆఫీసర్.. ఘాటుగా జవాబిచ్చిన రచయిత!
- గోవాలో బీఫ్ తిన్న రామచంద్రగుహ
- ఫొటోలను ట్విట్టర్ లో పంచుకున్న రచయిత
- బెదిరింపులకు దిగిన ‘రా’ మాజీ అధికారి
రామచంద్ర గుహ ఇటీవల గోవా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడే బీఫ్ తింటున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ‘రా’కు చెందిన మాజీ అధికారి ఆర్కే యాదవ్ స్పందిస్తూ..‘బీఫ్ తింటూ దాన్ని ప్రచారం చేసుకున్న హిందువు ఎవరైనా అతని జాతికి కళంకమే. అదే పనిని ఇప్పుడు రామచంద్రగుహ చేస్తున్నారు. ఆయన హిందువులందరినీ ఈ చర్యతో రెచ్చగొడుతున్నారు. ఇతనికి గట్టిగా బుద్ధి చెప్పాలి’ అని హెచ్చరించారు.
దీనిపై వెంటనే రామచంద్రగుహ స్పందించారు. తనను బెదిరిస్తూ ట్వీట్ చేసిన ఆర్కే యాదవ్ అనే వ్యక్తి ‘రా’కు చెందిన మాజీ అధికారి అని వ్యాఖ్యానించారు. ఇలా తనను బెదిరిస్తూ చేసే ప్రతీ ట్వీట్ ను రికార్డు చేసి పెడతానని తెలిపారు.