Sonia Gandhi: సోనియా ఆయురారోగ్యాలతో జీవించాలి: మోదీ

  • నేడు సోనియాగాంధీ పుట్టినరోజు
  • దేశ వ్యాప్తంగా వేడుకలను నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు
  • సోనియా ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించిన మోదీ
నేడు యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆమె పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియాకు ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'సోనియాగాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ఆమె సుదీర్ఘకాలం జీవించాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశారు. సోనియాకు పలువురు జాతీయ స్థాయి నేతలు కూడా శుభాకాంక్షలు తెలిపారు. 
Sonia Gandhi
birthday
modi
greetings
congress
bjp

More Telugu News