హైదరాబాద్ జిల్లాలో తొలి ఫలితం చార్మినార్‌ది వెల్లడయ్యే అవకాశం
- పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి లెక్కింపు సమయం
- అత్యంత తక్కువ కేంద్రాలు ఉన్నది ఈ నియోజకవర్గంలోనే
- చివరిలో వెల్లడికానున్న యాకుత్‌పురా ఫలితం
ఈ లెక్కన మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యాక మధ్యాహ్నం 12 గంటలకు చార్మినార్ ఫలితం వెలువడే అవకాశం ఉంది. యాకుత్‌పురా ఫలితం వెల్లడయ్యే సరికి రెండు గంటలు దాటిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నమోదైన పోలింగ్ శాతం, బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి ఫలితాల ప్రకటన కాస్త అటూ ఇటుగా మారే అవకాశం ఉంది.