KCR: టీఆర్ఎస్‌కు 106 సీట్ల సంగతేమో కానీ 108 సేవలు మాత్రం అవసరం: రావుల

  • కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తు చేసిన రావుల
  • హామీలు నెరవేర్చని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల ఓటు
  • ప్రజలు మంచి తీర్పే ఇచ్చి ఉంటారన్న టీడీపీ నేత
తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పే ఇచ్చినట్టు తాము భావిస్తున్నామని తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసినట్టు తెలుస్తోందన్నారు.

శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మాట్లాడిన ఆయన.. ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 106 సీట్లు వస్తాయని కేసీఆర్ పదే పదే చెప్పుకొచ్చారని గుర్తు చేశారు. టీఆర్ఎస్‌కు 106 సీట్ల సంగతేమో కానీ ఫలితాల వెల్లడి తర్వాత ఆ పార్టీకి 108 సేవలు మాత్రం అవసరం అవుతాయని ఎద్దేవా చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసి తాము కుంగిపోవడం లేదని, అలాగని పొంగిపోవడం కూడా లేదన్నారు.
KCR
Telangana
Telugudesam
Ravula chandrasekhar reddy
TRS

More Telugu News