kcr: కేసీఆర్ ఓడిపోతున్నారు.. డిపాజిట్ కూడా రాని పరిస్థితుల్లో ఉన్నారు: వంటేరు సంచలన వ్యాఖ్యలు

  • ఏదో విధంగా కేసీఆర్ గెలవాలని చూస్తున్నారు
  • ఎట్టి పరిస్థితుల్లోనూ మేము సహించం
  • గత ఎన్నికల్లో కుట్ర చేసి నన్ను ఓడించారు
గజ్వేల్ లో కేసీఆర్ ఓడిపోతున్నారని, డిపాజిట్ కూడా రాని పరిస్థితుల్లో ఆయన ఉన్నారంటూ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏదో విధంగా గెలవాలని ఆయన చూస్తున్నారని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని వంటేరు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

గత ఎన్నికల్లో కుట్ర చేసి తనను ఓడించారని, మళ్లీ కుట్ర చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేశానని, తాను నాయకుడినని, వీళ్ల లాగా కమర్షియల్ లీడర్ ని, అవినీతిపరుడిని కాదని టీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. తనకు ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకుని ప్రజల కోసం పోరాడుతున్నానని, వారికి సేవ చేస్తున్నానని అన్నారు.
kcr
onteru pratap reddy
gajwel
TRS
congress

More Telugu News