K. Babu Rao: ‘సిరిసిరిమువ్వ’ ఎడిటర్ కె.బాబురావు అనారోగ్యంతో మృతి

  • ‘సిరిసిరిమువ్వ’తో జాతీయ అవార్డు 
  • కె. విశ్వనాథ్ దగ్గర ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌
  • అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలో మృతి

ప్రముఖ సినీ ఎడిటర్ కె.బాబురావు ఈ రోజు చెన్నైలో మరణించారు. కళాతపస్వి కె. విశ్వనాథ్ దగ్గర పలు సినిమాలకు ఆయన ఎడిటర్‌గా పని చేశారు. ఆయన ఎడిట్ చేసిన చిత్రాల్లో 'సిరిసిరిమువ్వ' ఒకటి. ఈ చిత్రానికిగాను ఉత్తమ ఎడిటర్‌గా ఆయనకు జాతీయ అవార్డ్ కూడా లభించింది. ఆ తర్వాత కళాతపస్వితో బాబురావు సినీ ప్రయాణం కొనసాగింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. 

More Telugu News