vamsichand reddy: నాపై దాడి చేసింది బీజేపీ కార్యకర్తలే: వంశీచంద్ రెడ్డి

  • జంగారెడ్డిపల్లెలో పోలింగ్ స్టేషన్ పరిశీలనకు వెళ్లా
  • అక్కడ బీజేపీ కార్యకర్తలు నాపై దాడికి యత్నించారు
  • వాళ్లు విసిరిన రాళ్లు తగిలి నాకు తీవ్ర గాయాలయ్యాయి
కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై నిన్న దాడి జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన్ని విలేకరులు కలిశారు. నిన్న జంగారెడ్డిపల్లె పోలింగ్ స్టేషన్ ను పరిశీలించేందుకు వెళ్లిన తనపై బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించారని ఆరోపించారు.

అక్కడి నుంచి వాహనంలో బయలుదేరిన తనపై రాళ్లతో దాడి చేశారని, ఆ దాడిలో తనకు గాయాలైనట్టు చెప్పారు. ఓటమి భయంతోనే బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మకై తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. జంగారెడ్డిపల్లె పోలింగ్ స్టేషన్ సమస్యాత్మక ప్రాంతమని, తనకు తగిన భద్రత ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. కల్వకుర్తిలో తన గెలుపు ఖాయమని వంశీచంద్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  
vamsichand reddy
t-congress
kalvakurthi
bjp
TRS

More Telugu News