Retail: ఫేస్ బుక్ మెసెంజర్‌లో 'లైవ్ వీడియో షాపింగ్' ఫీచర్ రాబోతోంది!

  • లైవ్ షాపింగ్ చేసుకోవచ్చు
  • ధర చెల్లించగానే యూజర్ కి డెలివరీ అవుతుంది
  • ప్రస్తుతం పరీక్ష దశలో ఫీచర్

రోజు రోజుకి రకరకాల అప్ డేట్ లతో తమ యూజర్లని ఆకట్టుకుంటూ వస్తోన్న ప్రముఖ మెసేజింగ్ యాప్ 'ఫేస్ బుక్ మెసెంజర్‌' త్వరలోనే  'లైవ్ వీడియో షాపింగ్' పేరిట కొత్త ఫీచర్ ని తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు లైవ్ షాపింగ్ చేసుకోవచ్చు. షాప్ కి వెళ్లకుండానే ఈ ఫీచర్ ద్వారా హాయిగా ఇంట్లో కూర్చొని వస్తువుని ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న వస్తువుకి ధర చెల్లిస్తే యూజర్ కి డెలివరీ అవుతుంది. కాగా, ప్రస్తుతం థాయిలాండ్ లో పరీక్ష దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

More Telugu News