lagadapati: లగడపాటి గతంలో చెప్పింది ఏది నిజమైంది?: హరీష్ రావు

  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని లగడపాటి చెప్పలా!
  • ఈ సర్వేలో మొదట కూటమికి అనుకూలంగా చెప్పారు
  • అందుకని, నిన్న కూడా అదే మాట చెప్పారు
తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకొస్తుందన్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. లగడపాటి గతంలో చెప్పింది ఏది నిజమైందని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని లగడపాటి చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. లగడపాటి తన సర్వేలో మొదట ప్రజాకూటమికి అనుకూలంగా చెప్పారు కనుక, నిన్న కూడా అదే చెప్పారని అన్నారు.

 ఏఏ నియోజకవర్గాల్లో అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుస్తారని లగడపాటి చెప్పారో, వాళ్లెవరూ గెలవరని అన్నారు. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకొస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్న కాంగ్రెస్ పార్టీ నేతలు అందుకు సిద్ధంగా ఉండాలని, తక్కువ సీట్లు వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఆశలు అడియాశలు కానున్నాయని హరీష్ అన్నారు.
lagadapati
harish rao
survey
Telangana

More Telugu News