Guntur District: నాగార్జున వర్సిటీలో ప్రకృతి సదస్సు ప్రారంభం

  • ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
  • ఈనెల 17 వరకు 10 రోజులపాటు కొనసాగనున్న సదస్సు
  • వేలాది మంది రైతులకు శిక్షణ లక్ష్యం
సమగ్ర వ్యవసాయ విధానాలపై రైతులకు శిక్షణ అందించడం లక్ష్యంగా చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ సదస్సు శనివారం ఉదయం ప్రారంభమయింది. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతున్న ఈ సదస్సును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు.

ఈనెల 17వ తేదీ వరకు పది రోజుపాటు జరిగే ఈ సదస్సులో రైతులకు వ్యవసాయ అంశాలపై శిక్షణ అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్‌ పాలేకర్‌ హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు.
Guntur District
nagarnuna university
natural farming seminar
Chandrababu

More Telugu News