Rajasthan: రోడ్డుపై పడివున్న ఈవీఎం బ్యాలెట్‌ యూనిట్‌ బాక్స్‌...రాజస్థాన్‌లో ఘటన

  • ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించిన పోలీసులు
  • పొరపాటున జారిపడి ఉంటుందని భావన
  • స్ట్రాంగ్‌రూంకి తరలించిన భద్రతా సిబ్బంది

ఎన్నికల్లో విజయానికి ప్రతి ఓటూ కీలకమే. అటువంటిది ఎన్నికల్లో వినియోగించిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం) అనుబంధ బ్యాలెట్‌ బాక్స్‌ రోడ్డుపాలైందంటే ఎవరి జాతకాన్ని మార్చేసేదో ఎవరికి తెలుసు. అదృష్టవశాత్తు బాక్సు ను పోలీసులు సకాలంలో గుర్తించి స్ట్రాంగ్‌ రూంకు తరలించడంతో సమస్య తీరింది. రాజస్థాన్‌ రాష్ట్రంలోని కిషన్‌గంజ్‌ అసెంబ్లీ నియోకవర్గం షాహబాద్‌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే...నియోజక వర్గంలోని రోడ్డుపై ఓ బ్యాలెట్‌ యంత్రం పడివుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బ్యాలెట్‌ యూనిట్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఎన్నికల సంఘం సీల్‌ వేసి ఉండడంతో ఈవీఎంలను వాహనాల్లో తరలించేటప్పుడు పడిపోయి ఉంటుందని భావించారు. వెంటనే దాన్ని కిషన్‌గంజ్‌ స్ట్రాంగ్‌రూంకు తరలించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులు అబ్దుల్‌ రఫీక్‌, నవల్‌ సింగ్‌ పట్వారీలను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

  • Loading...

More Telugu News