Andhra Pradesh: సింహాచలం భైరవస్వామి ఆలయంలో తాంత్రికపూజలు.. అమావాస్య అర్ధరాత్రి పూజారుల నిర్వాకం!

  • అడవివరం భైరవస్వామి ఆలయంలో పూజలు
  • ఈవో ఆదేశాలతో నిర్వహించామన్న పూజారులు
  • స్పందించేందుకు అందుబాటులోకి రాని ఈవో

విశాఖపట్నం సింహాచలం శ్రీలక్ష్మి నరసింహస్వామి అనుబంధ ఆలయంలో తాంత్రిక పూజల కలకలం చెలరేగింది. సింహాచలం క్షేత్రపాలకుడిగా ఉన్న భైరవస్వామి ఆలయంలో ఇద్దరు ఆలయ పూజారులు స్వయంగా ఈ తాంత్రిక పూజల్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. గురువారం (అమావాస్య రోజు) అర్ధరాత్రి ఆలయ ఈవో ఆదేశాల మేరకే ఈ క్రతువును నిర్వహించినట్లు సమాచారం.

అడవివరానికి 4 కి.మీ దూరంలో భైరవస్వామి ఆలయం ఉంది. ఈ స్వామికి కొందరు అర్చకులు అమావాస్య రోజున మద్యంతో అభిషేకం నిర్వహించడంతో పాటు ఇక్కడ పూజలు నిర్వహించారని భక్తులు తెలిపారు. ఇందుకోసం తమను ఆలయ సిబ్బంది అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. ఇదేమని ప్రశ్నిస్తే.. ఈవో ఆదేశాలతోనే తాము ఈ పూజలు నిర్వహిస్తున్నామనీ, మరికాసేపు ఆగాలని వారు సూచించారని భక్తులు వాపోయారు. కాగా, ఈ తాంత్రిక పూజల వ్యవహారంపై ఈవోను సంప్రదించేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.

More Telugu News