Lagadapati: 2014లో తెలంగాణలో లగడపాటి సర్వే... చెప్పిందెంత? వాస్తవమేంటి?

  • 2014లో టీఆర్ఎస్ కు 60 సీట్ల వరకూ రావచ్చన్న లగడపాటి
  • 63 సీట్లు సాధించిన గులాబీ దళం
  • టీడీపీ కూటమికి 18 నుంచి 22 సీట్లు వస్తాయని వెల్లడి
  • 20 సీట్లు సాధించిన తెలుగుదేశం - బీజేపీ జట్టు

లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ టీమ్... దక్షిణాది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, ఆయన టీమ్ సర్వే చేసి ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తుంటుంది. అత్యధిక సందర్భాల్లో ఆయన చేయించే సర్వే వాస్తవ పరిస్థితికి చాలా దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం ఆయన తెలంగాణపై సర్వే చేయించి, ప్రజా కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. జాతీయ మీడియా సంస్థలు మాత్రం అధికారం టీఆర్ఎస్ దేనని అంటున్నాయి. ఈ నేపథ్యంలో 2014లో తెలంగాణకు జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి సర్వే ఫలితాలను, వాస్తవ పలితాలను ఓ మారు పరిశీలిస్తే...

ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలసి పోటీ చేయగా, 18 నుంచి 22 సీట్లు వస్తాయని లగడపాటి అంచనా వేయగా, 20 సీట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ కు 50 నుంచి 60 సీట్లు వస్తాయని ఆయన చెప్పగా, 63 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ కు 30 నుంచి 40 సీట్లు వస్తాయని చెప్పగా, ఆ పార్టీ 20 సీట్లకే పరిమితమైంది. 7 నుంచి 9 చోట్ల ఇతరులు వస్తారని అంచనా వేయగా, 15 మంది గెలిచారు.

అంటే టీఆర్ఎస్, టీడీపీ విషయంలో ఆయన అంచనా ఫలించినట్టే. కాంగ్రెస్ విషయంలో మాత్రం ఓటర్ల నాడిని ఆయన టీమ్ అందుకోలేకపోయింది. మొత్తం మీద అంకెలు కాస్త అటూఇటుగా కనిపిస్తున్నా, ఆయన ఎగ్జిట్‌ పోల్‌ సర్వే నిజమైందనే చెప్పవచ్చు.

More Telugu News