Gutta Jwala: గుత్తా జ్వాల ఆవేదనపై ఈసీ వివరణ!

  • తన ఓటు లేదని వాపోయిన గుత్తా జ్వాల
  • 2015లోనే తొలగించారన్న రజత్ కుమార్
  • విచారణకు ఆదేశించినట్టు వెల్లడి
తన ఓటు గల్లంతైందని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల చేసిన ఆరోపణలపై సీఈఓ రజత్ కుమార్ స్పందించారు. జ్వాల పేరు 2015లో జరిగిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం సమయంలో తొలగించబడిందని తెలిపారు. గుత్తా జ్వాల ఓటు తొలగింపుపై విచారణ జరిపి నివేదిక అందించాలని ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారిని తాను ఆదేశించానని, వ్యక్తిగతంగానూ ఆమెకు క్షమాపణలు చెబుతున్నానని, వెంటనే ఆమె పేరును ఓటర్ల జాబితాలో చేర్చేందుకు చర్యలు చేపట్టనున్నామని అన్నారు. కాగా, నిన్న ఓటు వేసేందుకు వచ్చిన జ్వాల, తన ఓటు లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగిన సంగతి తెలిసిందే.
Gutta Jwala
EC
Vote
Rajat Kumar

More Telugu News