Jagan: జగన్ నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది: కళావెంకట్రావు

  • జగన్ చేసిన విమర్శలను ఖండించిన కళా వెంకట్రావు
  • వైసీపీ అదొక పార్టీనే కాదు.. ఓ సర్కస్ కంపెనీ 
  • జగన్ ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టకరం

వైసీసీ అధినేత జగన్ తనపై చేసిన ఆరోపణలు, విమర్శలను టీడీపీ నేత కళా వెంకట్రావు ఖండించారు. ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు. మూడొందల రోజులు పాదయాత్ర చేసిన జగన్, ఐదు ఎకరాల స్థలంలో ఎక్కడైనా బహిరంగ సభ పెట్టారా? అని ప్రశ్నించారు.

అసలు, వైసీపీ అదొక పార్టీనే కాదని ఓ సర్కస్ కంపెనీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పక్క జిల్లాల్లో ఉండి కూడా తిత్లీ బాధితులను పరామర్శించలేదని విమర్శించారు. జగన్ లాంటి నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టకరమని, జగన్ వ్యవహారశైలిని తెలుగు ప్రజలు అసహ్యించుకుంటున్నారని, జగన్ ది నేర చరిత్ర కలిగిన కుటుంబమని వివరించారు.

పదహారేళ్ల వయసులోనే ఎర్రగడ్డ సూట్ కేసు బాంబు కేసులో నిందితుడని, ఆ కేసు నుంచి జగన్ ని తప్పించడానికి ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎవరి దగ్గర ప్రాధేయపడ్డారో తెలుసుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News