Aroon Finch: ఆనందంతో గాల్లోకి పంచ్ లు విసిరిన కోహ్లీ... వీడియో!

  • తొలి టెస్టులో డక్కౌట్ అయిన ఆరోన్ ఫించ్
  • వికెట్ ను తీసిన ఇషాంత్ శర్మ
  • ఆనందంతో గంతులేసిన కోహ్లీ
అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆటలో ఫించ్ అవుట్ అయిన తరువాత విరాట్ కోహ్లీ ఆనందంతో గాల్లోకి పంచ్ లు విసిరిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ 250 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

ఆపై నేడు తొలి ఇన్నింగ్స్ ను ఆసిస్ ఆటగాళ్లు ప్రారంభించగా, పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ దిమ్మతిరిగే ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఓవర్ ను వేసిన ఇషాంత్, తన మూడో బంతికే అరోన్ ఫించ్ వికెట్ ను దొరకబుచ్చుకున్నాడు. ఆఫ్ స్టంప్‌ కి ఆవల పడ్డ బంతి, బ్యాట్ ను తాకుతూ వెళ్లి, వికెట్లను గిరాటేసింది. దీన్ని దగ్గర నుంచి చూసిన విరాట్ కోహ్లి ఆనందంతో గాల్లో పంచ్‌ లిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ వీడియోను నెట్టింట పోస్ట్ చేయగా అదిప్పుడు వైరల్ అవుతోంది.



Aroon Finch
Ishant Sharma
Virat Kohli

More Telugu News