venkatesh: 'ఎఫ్ 2'లో గెస్ట్ రోల్ చేసిన అనసూయ

  • అనిల్ రావిపూడి నుంచి 'ఎఫ్ 2'
  • నాన్ స్టాప్ నవ్వులతో సాగే కథ 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు

వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా దర్శకుడు అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' సినిమా చేశాడు. ఒక్క యాక్షన్ సీన్ కూడా లేకుండగా పూర్తి వినోదభరితంగా ఈసారి ఆయన ఈ సినిమాను రూపొందించాడు. తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, అనసూయ ఒక స్పెషల్ సాంగ్ లో మెరవనుందనే వార్తలు వచ్చాయి.

అయితే ఈ సినిమాలో ఆమె కేవలం స్పెషల్ సాంగ్ లో మెరవడమే కాదు .. ముఖ్యమైన గెస్టు రోల్ కూడా చేసిందట. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. పాత్రతో ముడిపడిన స్పెషల్ సాంగ్స్ కి మాత్రమే ప్రాముఖ్యతనిస్తానని గతంలోనే అనసూయ చెప్పింది. ఈ సినిమాలో మంచి రోల్ తో పాటు స్పెషల్ సాంగ్ కూడా ఉండటంతోనే ఆమె అంగీకరించిందట.

ఇక ఈ స్పెషల్ సాంగ్ లో ఆమెతో పాటు వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కలిసి స్టెప్పులు వేయనుండటం విశేషం. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

More Telugu News