Narendra Modi: ఓటేసి ప్రజాస్వామ్యాన్ని సుసంపన్నం చేయండి.. తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని

  • తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ట్వీట్
  • అందరూ విధిగా ఓటు వేయాలని ప్రార్థన
  • తెలుగులో ట్వీట్ చేసి ఆశ్చర్యపరిచిన మోదీ
దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణలో పోలింగ్ మొదలైంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కేంద్రాల ముందు భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సెలబ్రిటీల్లో పలువురు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ తెలుగులో ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇవాళ ఎన్నికల రోజని, తెలంగాణలోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. యువ మిత్రులందరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
Narendra Modi
Telangana
Elections
Twitter
BJP

More Telugu News