Kaira Advani: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • హీరోయిన్లను ఎంపిక చేసిన రాజమౌళి 
  • మైసూర్ ప్యాలెస్ కి వెళుతున్న 'సైరా'  
  • అమెరికాలో అనుష్క సినిమా షూటింగ్

*  ఎన్టీఆర్, రాం చరణ్ హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. కాగా, ఇందులో ఎన్టీఆర్ సరసన కైరా అద్వానీ, చరణ్ పక్కన కీర్తి సురేశ్ హీరోయిన్లుగా ఎంపికైనట్టు సమాచారం
*  చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'సైరా' చిత్రం తదుపరి షెడ్యూల్ షూటింగ్ ఈ నెలాఖరు నుంచి జరుగుతుంది. మైసూర్ ప్యాలెస్ లో ఈ షెడ్యూల్ ను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
*  అనుష్క తన తదుపరి చిత్రాన్ని హేమంత్ మధుకర్ దర్శకత్వంలో చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరుగుతుంది. కాగా, ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తాడు. 

More Telugu News