Telangana: సిరిసిల్లలో ప్రలోభాల పర్వం.. అర్ధరాత్రి ఆందోళనకు దిగిన కాంగ్రెస్ అభ్యర్థి

  • అనుచరులతో కలిసి మహేందర్ రెడ్డి ఆందోళన
  • నగదు, మద్యం పంపిణీ జరుగుతోందని ఆరోపణ
  • చర్యలు తీసుకుంటామని పోలీసుల హామీ
ప్రచారం ముగిసి పోలింగ్‌కు సిద్ధమైన వేళ రాజకీయ నేతలు ప్రలోభాలకు తెరలేపారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల డబ్బు భారీగా పట్టుబడింది. మరోవైపు సిరిసిల్లలో గురువారం అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. నియోజకవర్గంలో మద్యం, డబ్బు పంపిణీ జోరుగా సాగుతోందని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ రెడ్డి ఆరోపించారు.

అంతేకాదు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ అర్ధ రాత్రి అనుచరులు, కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయనతో చర్చించారు. తనిఖీలు చేపడతామని, నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మహేందర్ రెడ్డి నిరసన విరమించినట్టు సమాచారం.
Telangana
Rajanna Sircilla District
Mahendar reddy
Congress

More Telugu News