Google: గూగుల్ నుంచి రిలయన్స్ జియోకు గట్టి దెబ్బ!

  • జియోకి దీటుగా ‘విజ్‌ఫోన్ డబ్ల్యూపీ006’
  • రూ.500కే ఫీచర్ ఫోన్
  • ఇండోనేషియాలో ఆవిష్కరించిన గూగుల్
  • జియో మాదిరిగానే అన్ని ఫీచర్స్
ఇప్పటి వరకూ ప్రత్యర్థి సంస్థలను హడలెత్తిస్తూ వచ్చిన రిలయన్స్ జియోకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ నుంచి గట్టి దెబ్బ తగలనుంది. జియో 4జీ ఫోన్‌కు దీటుగా ‘విజ్‌ఫోన్ డబ్ల్యూపీ006’ పేరుతో ఫీచర్‌ఫోన్‌ను తీసుకురాబోతోంది. ఇటీవలే ఇండోనేషియాలో జరిగిన ఓ కార్యక్రమంలో గూగుల్ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది.

భారత్ కరెన్సీలో దీని విలువ రూ.500. జియో ఫోన్‌ మాదిరిగానే ఇది కూడా ‘కై ఓఎస్’తోనే పనిచేస్తుంది. ఈ ఫోన్ 4జీకి కూడా సపోర్ట్ చేస్తుంది. జియో ఫోన్‌లో ఉన్నట్టే దీనిలోనూ అన్ని ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్ వంటి యాప్స్‌ కూడా ఈ ఫోనులో ఉంటాయి. క్వాల్‌కామ్ ఎంఎస్ఎం 8905 చిప్‌సెట్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటివి ఉన్నాయి.
Google
Reliance JIo
Indonasia
Google maps
Google search

More Telugu News