Uttam Kumar Reddy: ప్రజా కూటమి నేతలు తప్పుడు ఆరోపణలు చేశారు: అదనపు డీజీ జితేందర్

  • ఉత్తమ్, చిన్నారెడ్డి ఇళ్లలో సోదాలు చేయలేదు
  • మాకు అన్ని పార్టీలు సమానమే 
  • ఎలాంటి పక్షపాతం లేకుండా పని చేస్తున్నాం
ప్రజా కూటమి నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని తెలంగాణ అదనపు డీజీ జితేందర్ అన్నారు. టీ-కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిన్నారెడ్డి ఇళ్లలో సోదాలు చేసినట్టు ఫిర్యాదు చేశారని, వారి ఇళ్లలో ఎలాంటి సోదాలు చేయలేదని స్పష్టం చేశారు.

తమకు అన్ని పార్టీలు సమానమేనని, తాము ఎలాంటి పక్షపాతం లేకుండా పని చేస్తున్నామని అన్నారు. కాగా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో డీజీపీ మహేందర్ రెడ్డి, అదనపు డీజీ జితేందర్, అన్ని జిల్లాల ఎన్నికల, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Uttam Kumar Reddy
chinna reddy
prjakutami
rajathkumar

More Telugu News