Janardhan Reddy: నాగం జనార్దన్ రెడ్డి వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నం.. ఘర్షణ

  • ప్రచారానికి వచ్చారని అడ్డుకున్న టీఆర్ఎస్
  • కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ
  • పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు

ఎన్నికల పోలింగ్‌కు మరికొద్ది గంటలే సమయం ఉంది. ఈ నేపథ్యంలో పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి జనార్దన్ రెడ్డి వాహనాన్ని టీఆర్ఎస్ వర్గాలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ జరిగింది.

తిమ్మాజీపేట మండలం గుమ్మకొండకు నాగం వెళ్లడంతో ఎన్నికల ప్రచారానికి వచ్చారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన కారును అడ్డుకునేందుకు యత్నించడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు గుమ్మకొండ గ్రామానికి వెళ్లి పరిస్థితిని అదుపు చేశారు.

  • Loading...

More Telugu News