tirupathi: సంక్షేమ పథకాల ద్వారా మాత్రమే పేదరికం దూరం కాదు: సీఎం చంద్రబాబునాయుడు

  • ఆదాయం కల్పించేలా ఆలోచనలు సాగాలి
  • అన్న క్యాంటీన్ల ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తున్నాం
  • అనంతపురంలో సౌత్ కొరియా టౌన్ షిప్ 

సంక్షేమ పథకాల ద్వారా మాత్రమే పేదరికం దూరం కాదని, ప్రతి కుటుంబానికి ఆదాయం కల్పించేలా ఆలోచనలు సాగాలని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తిరుపతిలో నిర్వహించిన ‘పేదరికంపై గెలుపు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఫరూక్, అచ్చెన్నాయుడు, అమరనాథ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా 10,138 మంది లబ్ధిదారులకు పనిముట్లు, నిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తున్నామని, రూ.5కే పేదవాడి ఆకలి తీర్చే పథకం దేశంలో మరెక్కడా లేదని అన్నారు. ‘ఆదరణ-2’లో రెండు లక్షల మందికి ప్రభుత్వ సాయం అందించామని, కమ్యూనిటీ గోకులాలు నిర్మించి, మహిళా సంఘాలకు అప్పగిస్తామని చెప్పారు. పేదలకు 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తున్న ప్రభుత్వం తమదని, అనంతపురం జిల్లాలో సౌత్ కొరియా టౌన్ షిప్ ఏర్పాటు చేస్తామని అన్నారు.

More Telugu News