jupudi prabhakar: నా ఇంట్లో తనిఖీలు చేశారు.. ఎలాంటి నగదు లేదని వెళ్లిపోయారు: జూపూడి ప్రభాకర్

  • ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు చేశారు
  • నగదు దొరికితే చూపించాలి
  • బంధువులను కూడా ఇంట్లోకి రానివ్వడం లేదు
హైదరాబాద్ కూకట్ పల్లిలో ఉన్న ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభార్ రావు ఇంటి వద్ద నగదు దొరికిందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై జూపూడి స్పందించారు. కూకట్ పల్లి బాలాజీ నగర్ లో ఉన్న తన నివాసంలో ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు నిర్వహించారని... అయితే, ఎలాంటి నగదు దొరకలేదని వెళ్లిపోయారని చెప్పారు.

ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. తమ బంధువులను కూడా ఇంట్లోకి రానివ్వడం లేదని మండిపడ్డారు. ఎక్కడ బతకాలో తమకు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో తాను, తన భార్య మాత్రమే ఉంటున్నామని... కావాలనే ఇదంతా చేస్తున్నారని అన్నారు. ఇలా చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పారు. తన ఇంట్లో నగదు దొరికితే చూపించాలని డిమాండ్ చేశారు. 
jupudi prabhakar
kukatpalli
ec
raids
Telugudesam
TRS

More Telugu News