vijay devarakonda: రెండవసారి కూడా మంచి రేటింగును రాబట్టిన 'గీతగోవిందం'

  • అందరినీ ఆకట్టుకున్న ప్రేమకథ 
  • విజయ్ దేవరకొండను స్టార్ ను చేసిన సినిమా 
  • రెండవసారి కూడా భారీ రేటింగ్
తెలుగు తెరపై ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రేమకథా చిత్రాలలో 'గీత గోవిందం' ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా చేసిన ఈ సినిమా, 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండ స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోయాడు. అలాంటి ఈ సినిమాను తొలిసారిగా జీ తెలుగు చానల్లో ఆ మధ్య ప్రసారం చేసినప్పుడు 20.18 టీఆర్పీని సాధించింది. ఈ స్థాయి రేటింగ్ రావడం అంత ఆషామాషీ విషయమేం కాదు.

ఇక ఏ సినిమా అయినా రెండవసారి బుల్లితెరపై ప్రసారమైనప్పుడు రేటింగ్ విషయంలో భారీ తేడా కనిపిస్తూ ఉంటుంది. కానీ 'గీతగోవిందం' విషయంలో అలా జరగలేదు. ఇటీవల జీ తెలుగువారు రెండవసారి ఈ సినిమాను ప్రసారం చేసినప్పుడు 17.16 టీఆర్పీని రాబట్టింది. తొలిసారి సాధించిన రేటింగుకి .. రెండవసారి రాబట్టిన రేటింగుకి మధ్య తేడా చాలా తక్కువగా ఉండటం విశేషం. మొత్తానికి 'గీతగోవిందం' ఇంకా తన సత్తాను చాటుతునే ఉందన్న మాట.
vijay devarakonda
rashmika

More Telugu News