మరింత గ్లామరస్ గా బీజేపీ.. లోక్ సభ ఎన్నికల బరిలోకి మాధురీ దీక్షిత్
- పూణె స్థానం నుంచి మాధురీ దీక్షిత్
- మాధురీ పేరు షార్ట్ లిస్ట్ చేశామన్న సీనియర్ నేత
- జూన్ లో మాధురీతో భేటీ అయిన అమిత్ షా
తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ బీజేపీ సీనియర్ నేత పీటీఐతో మాట్లాడుతూ, పూణె స్థానానికి సంబంధించి మాధురీ దీక్షిత్ పేరును ఖరారు చేసినట్టు తెలిపారు. ఆమెకు పూణె నియోజకవర్గం సరిగ్గా సరిపోతుందని చెప్పారు. ఎన్నికల్లో కొత్తవారిని బరిలోకి దింపడం వల్ల ఉపయోగం ఉంటుందని... వారిని విమర్శించడానికి విపక్షాలకు ఎలాంటి ఆయుధాలు దొరకవని తెలిపారు.