balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకపై ఆలోచన

  • తిరుపతిలో ఆడియో వేడుక 
  • ఆడియో రిలీజ్ డేట్ మార్చే అవకాశం 
  • జనవరి 9న సినిమా విడుదల    

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ చకచకా జరిగిపోతోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన తిరుపతిలో ఘనంగా ఆడియో వేడుక జరపాలని అనుకున్నారు. అందుకు సంబంధించిన ప్లానింగ్ పక్కాగా జరిగిపోయింది. అయితే 11వ తేదీన తెలంగాణలో ఓట్లలెక్కింపు వుంది. ఫలితాలు .. వాటి పరిణామాలపైనే జనం దృష్టి ఉంటుంది.

అందువలన 16వ తేదీన ఆడియో వేడుక చేయాలా .. వద్దా? అనే ఆలోచనలో ఉన్నారట. పరిస్థితులను బట్టి 16న చేయాలనీ .. లేదంటే 21వ తేదీన చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ లో మొత్తం 11 సాంగ్స్ వున్నాయనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ గా బాలకృష్ణ వివిధ రకాల గెటప్స్ .. భారీ తారాగణం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.     

More Telugu News