Nirmal: నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి ఇంటిముందు కత్తులతో దాడి!

  • టీఎస్ 18 ఏ 8888' కారులో వచ్చిన దుండగులు
  • ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నం, అడ్డుకున్న కార్యకర్తలు
  • కత్తులతో దాడి చేసి పారిపోయిన వైనం 
నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్‌ రెడ్డి ఇంటి దగ్గర గత అర్ధరాత్రి జరిగిన కత్తిపోట్ల ఘటనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 'టీఎస్ 18 ఏ 8888' నంబరుగల కారులో వచ్చిన కొందరు దుండగులు మహేశ్వర్‌ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించేందుకు విశ్వప్రయత్నం చేశారు.

అక్కడే ఉన్న ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు, వారిని అడ్డుకోగా, కత్తులతో దాడి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల కేకలతో మరింతమంది అక్కడికి చేరడంతో వారు పరారయ్యారు. దాడికి వచ్చిన వారు ఇంద్రకరణ్ రెడ్డి బంధువులేనని, ఆయనే భౌతిక దాడులకు మద్దతిస్తున్నారని నిర్మల్ మునిసిపల్ చైర్మన్ అప్పాల గణేష్ ఆరోపించారు.
Nirmal
Maheshwar Reddy
Congress

More Telugu News