KCR: కేసీఆర్ ఆలంపూర్‌ సభలో ఉపయోగించిన భాషపై మండిపడుతున్న కాంగ్రెస్

  • అలంపూర్ బహిరంగ సభలో కేసీఆర్‌ను ప్రశ్నించిన ప్రజలు
  • వేదికపై నుంచే కేసీఆర్ ఆగ్రహం 
  • భాష మార్చుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్
ఆలంపూర్ చౌరస్తాలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో తనను ప్రశ్నించిన కొందరిపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజాసంఘాల నాయకులు, కాంగ్రెస్ నేతలు, ఉద్యమకారులు దీనిపై విలేకరులతో మాట్లాడుతూ.. సభలోనే ప్రజలను దుర్భాషలాడిన కేసీఆర్‌కు అలంపూర్ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

కేసీఆర్ తన పద్ధతిని మార్చుకోవాలని, ఆలంపూర్ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఓ వ్యక్తి ఇలా దిగజారి మాట్లాడడం ఏంటని, భాష మార్చుకోవాలని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే మళ్లీ ఆలంపూర్‌లో అడుగుపెట్టలేవంటూ హెచ్చరించారు. ఇది దొరల పాలన కాదన్న సంగతిని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
KCR
Telangana
Alampur
Mahabubabad District
Congress

More Telugu News