Einstain: వేలంలో షాకింగ్ ధర పలికిన ఐన్‌స్టీన్ లేఖ

  • చనిపోవడానికి ఒక ఏడాది ముందు రాసిన లేఖ
  • ‘గాడ్ లెటర్‌’గా ప్రాచుర్యం
  • అందులో మతం గురించి ఐన్‌స్టీన్ ఆలోచనలు

ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ రాసిన లేఖకు వేలంలో షాకింగ్ ధర పలికింది. ఐన్‌స్టీన్ తాను చనిపోవడానికి ఒక ఏడాది ముందు రాసిన రెండు పేజీల లేఖ ‘గాడ్ లెటర్‌’గా ప్రాచుర్యం పొందింది. ఈ లేఖను 1954 జనవరి 3వ తేదీన రాశారు. ఈ లేఖను అమెరికాలో క్రిస్టీస్ అనే సంస్థ తాజాగా వేలం వేసింది.

ఈ లేఖ 1.5 మిలియన్ డాలర్లు పలుకుతుందని అంచనా వేయగా, 2.89 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.20 కోట్లు పలికింది. ఈ లేఖలో మతం గురించి ఐన్‌స్టీన్ తన ఆలోచనలు వివరించారు. దేవుడు అనే పదం ఓ వ్యక్తీకరణ అని, మనిషి బలహీనత నుంచి అది వచ్చిందని ఐన్‌స్టీన్‌ లేఖలో పేర్కొన్నారు.  

More Telugu News