Vijaya bank: బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ.. 21, 26న బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె!

  • మూడు బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తున్న సిబ్బంది 
  • సమ్మెలో ప్రభుత్వ రంగ బ్యాంకుల యూనియన్లు 
  • బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించే అవకాశం
విజయా బ్యాంకు, దేనా బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రతిపాదిత విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే డిసెంబరు 26న సమ్మె తలపెట్టినట్టు బ్యాంకు యూనియన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అదనంగా ఈ నెల 21న కూడా సమ్మె చేయనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ నేడు ప్రకటించింది. దీంతో బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించే అవకాశం వుంది.

దీంతో ఈ నెల 21 నుంచి 26 వరకూ ఒక్క 24 మినహా బ్యాంకులు పనిచేయకపోవచ్చు. దీనికి కారణం 22, 23 శని, ఆదివారాలు కాగా 25 క్రిస్మస్ కారణంగా బ్యాంకులకు సెలవు. ప్రభుత్వ రంగ బ్యాంకుల యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొననున్నాయి. స్కేల్‌ 4, ఆపై ఉద్యోగుల వేతనాల విషయంలో ఇండియన్‌ బ్యాంకు అసోసియేషన్‌(ఐబీఏ) వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ సమ్మె చేయనున్నట్లు ఏఐబీఓసీ నోటీసులు విడుదల చేసింది.
Vijaya bank
Dena Bank
Bank Of Baroda
Strike
IBA
AIBOC

More Telugu News