Sharukh Khan: 'మహా' సీఎం నాకు మంచి మిత్రుడు.. తెల్లవారుజామున 3 గంటలకు కూడా ఫోన్ చేస్తుంటాను!: షారుఖ్ ఖాన్

  • ఫడ్నవీస్‌తో అనుబంధాన్ని పంచుకున్న షారుఖ్
  • ఒంటరిగా ఫీలయితే సీఎంకే ఫోన్ చేస్తా
  • సమస్య వస్తే ముందు గుర్తొచ్చేది ఆయనే 
మనకు ఏదైనా బాధ అనిపిస్తే వెంటనే ఆప్తులకు ఫోన్ చేసి వారితో పంచుకుంటాం. దీనికి సెలబ్రిటీలేం అతీతులు కాదు. అయితే, తాను బాధలో ఉన్నప్పుడు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫోన్ చేస్తానని.. అలా తెల్లవారుజామున 3 గంటలకు కూడా ఫోన్ చేసిన రోజులున్నాయని బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తెలిపారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో తనకున్న అనుబంధాన్ని షారుఖ్ ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. ముంబయిలో జరిగిన ‘ముంబయి 2.0’ కార్యక్రమానికి ఫడ్నవీస్, షారుఖ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా షారుఖ్ మాట్లాడుతూ.. ఫడ్నవీస్ తనకు చాలా మంచి స్నేహితుడని.. ఎప్పుడైనా తాను ఒంటరిగా ఫీలయితే ఆయనకే ఫోన్ చేస్తానని వెల్లడించారు. తనకు ఏదైనా సమస్య వస్తే ముందు గుర్తొచ్చేది ఫడ్నవీసేనని తెలిపారు. రాత్రి వేళల్లో మెసేజ్‌లు చేసి ఎవ్వరికీ అసౌకర్యం కలిగించనని.. కానీ ఫడ్నవీస్‌కు మాత్రం తెల్లవారుజామున 3 గంటలకు సైతం ఫోన్ చేసిన రోజులు ఉన్నాయన్నారు. ఆయన కూడా వెంటనే స్పందించి సాయం చేస్తుంటారని షారుఖ్ చెప్పారు. 
Sharukh Khan
Devendra Phadnavees
Mumbai
Mumbai 2.0

More Telugu News