2018: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన.. ‘తెలుగు’ నుంచి కొలకలూరి ఇనాక్ కు దక్కిన గౌరవం

  • 24 భాషల్లోని సాహిత్య రచనలకు అవార్డులు
  • తెలుగు భాష నుంచి ‘విమర్శిని’ ఎంపిక
  • జనవరి 29న ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం

2018 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ప్రముఖ రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్ ఎంపికయ్యారు. ఇనాక్ రచించిన ‘విమర్శిని’ పుస్తకానికి గాను ఈ అవార్డు లభించింది. 24 భాషల్లోని సాహిత్య రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించగా, తెలుగు భాష నుంచి ‘విమర్శిని’కి ఈ గౌరవం దక్కింది. 2019 జనవరి 29న ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

కాగా, 1954లో ‘లోకంపోకడ’, ‘ఉత్తరం’ అనే కథానికల ద్వారా తెలుగు సాహితీ లోకంలో ఆయన తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.1958లో ‘దృష్టి’ అనే నాటికను రచించారు. ఇనాక్ రచించిన ‘మునివాహనుడు’ కథా సంపుటి, ‘అనంత జీవనం’కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ‘అనంత జీవనం’కు మూర్తి దేవి అవార్డు లభించింది.

More Telugu News