kcr: సహారా కేసులో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: గోనె ప్రకాశ్ రావు

  • సహారా సంస్థ నుంచి కేసీఆర్ ముడుపులు స్వీకరించారు
  • కేసీఆర్ నిర్ణయం కారణంగా 11 లక్షల మందికి అన్యాయం జరిగింది
  • 2015లో కేసీఆర్ ను సీబీఐ అధికారులు విచారించారు

కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ సహారా సంస్థ యాజమాన్యం నుంచి ముడుపులు స్వీకరించారని ఆర్టీసీ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు ఆరోపించారు. అప్పట్లో కేసీఆర్ తీసుకున్న అనుచిత నిర్ణయం కారణంగా ఆ సంస్థలోని 11 లక్షల మందికి అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. సహారా సంస్థకు లబ్ధి చేకూరేలా వ్యవహరించిన కేసీఆర్ జైలుకు వెళ్లక తప్పదని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015లో ఆయనను సీబీఐ అధికారులు దాదాపు 10 గంటల సేపు విచారించారని చెప్పారు. విచారణ జరిగిన మరుసటి రోజు ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ ప్రధాని మోదీ ముందు మోకరిల్లారని తెలిపారు.

More Telugu News