Telangana: ఎన్నికల రోజు సెలవుందా? లేదా?: అయోమయంలో లక్షలాది మంది ఉద్యోగులు!

  • ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం సెలవు
  • ప్రైవేటు రంగంలో ఇంకా రాని స్పష్టత
  • సెలవు కావాలంటున్న ఉద్యోగులు

ఎన్నికల రోజు సెలవు వుందా? లేదా? ఇదే తెలంగాణలోని లక్షలాది మంది ప్రైవేటు ఉద్యోగుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు ఇప్పటికే సెలవు ప్రకటించగా, ప్రైవేటు రంగంలో ప్రధానంగా ఐటీ, మౌలిక రంగాల్లోని కంపెనీల్లో సెలవుపై ఇంతవరకూ స్పష్టత రాలేదు.

దీంతో తాము స్వగ్రామాలకు వెళ్లి ఓటు వేసి రాగలమా? అని ఉద్యోగులు మధనపడుతున్నారు. కొన్ని కంపెనీలు శుక్రవారం నాడు సెలవు ప్రకటించి, రెండో శనివారమైన 8వ తేదీన విధులకు హాజరు కావాలని ఆదేశించాయి. దీంతో కుటుంబ సమేతంగా ఊరికి వెళ్లి, ఒక్క రోజులో ఎలా తిరిగి రావాలని ఉద్యోగులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ప్రైవేటు రంగంలోని అన్ని సంస్థలూ సెలవు ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

More Telugu News