KCR: కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత... పోలింగ్ శాతం పెరిగినా, తగ్గినా ఒకే ఫలితం: సి నరసింహారావు

  • కేసీఆర్ వ్యక్తిత్వాన్ని ప్రజలు ఇష్టపడటం లేదు 
  • ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమవుతుంది
  • సంక్షేమ కార్యక్రమాలే ఓట్లు కురిపించబోవన్న నరసింహరావు

తెలంగాణకు జరగనున్న ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగినా, తగ్గినా ఎటువంటి మార్పూ ఉండబోదని భావిస్తున్నట్టు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీ నరసింహారావు వ్యాఖ్యానించారు. నిన్న లగడపాటి రాజగోపాల్ తన అంచనాలను వెల్లడించిన నేపథ్యంలో ఓ టీవీ చానల్ చర్చలో పాల్గొన్న నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అది ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టం కానుందని అన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని ప్రజలు ఇష్టపడటం లేదని, కేవలం సంక్షేమ కార్యక్రమాలే ఓట్లను తెస్తాయని భావించడం తప్పని అన్నారు. తెలంగాణలో ప్రజల అవసరాలు ఏంటన్న విషయాన్ని తెలుసుకునేందుకు కేసీఆర్‌ ప్రయత్నించలేదని అన్నారు. కీలక హామీలైన యువతకు ఉద్యోగాలు, ఉపాధి గురించి ప్రభుత్వం పట్టించుకోలేదని అభిప్రాయపడ్డారు. పోలింగ్ శాతం పెరిగినా, తగ్గినా ప్రజా కూటమివైపే మొగ్గు కనిపిస్తుందని అన్నారు.

  • Loading...

More Telugu News