G-Sat 11: విజయవంతంగా జీ శాట్ 11 నింగిలోకి!

  • ఫ్రెంచ్‌ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగం
  • ఇస్రో శాటిలైట్లలో అన్నింటికన్నా బరువు
  • సెకనుకు 100 జీబీ డేటాను అందించే ఉపగ్రహం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను మరింత విస్తృతం చేయడంతో పాటు, నవతరం అప్లికేషన్ల రూపకల్పనకు సహకరించే కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్‌-11ను నింగిలోకి పంపింది. దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్‌ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లిన ఏరియన్‌ - 5 రాకెట్‌, 33 నిమిషాల అనంతరం జీశాట్-11ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 5,854 కిలోల బరువుండే జీశాట్‌-11 ఇస్రో ఇప్పటివరకు ప్రయోగించిన ఉపగ్రహాల అన్నింటికన్నా బరువైనది కావడం గమనార్హం. ఇండియా అంతా సెకనుకు 100 జీబీ డేటా అందించేందుకు నాలుగు జీశాట్‌-11 ప్రయోగాలకు ఇస్రో ప్రణాళికలు వేయగా, ఇది మూడవది. సుమారు 15 ఏళ్లపాటు ఈ ఉపగ్రహం నిరంతర సేవలు అందించనుంది. దీనికి ‘బిగ్‌ బర్డ్‌’ అని నామకరణం చేసుకున్న ఇస్రో, తయారీకి దాదాపు రూ.600 కోట్లు ఖర్చు చేసింది.

  • Loading...

More Telugu News