kcr: ఉమ్మడి మహబూబ్ నగర్ లో 14కు 14 సీట్లు మావే: సీఎం కేసీఆర్

  • మహబూబ్ నగర్ ప్రజల్లో చాలా మార్పు వచ్చింది
  • ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి
  • ఈసారి కూడా టీఆర్ఎస్ ను ప్రజలు దీవించాలి
ఉమ్మడి మహబూబ్ నగర్ లో పద్నాలుగుకు పద్నాలుగు సీట్లలో తామే విజయం సాధిస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో జరుగుతున్న టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, మహబూబ్ నగర్ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని అన్నారు.

ఈ సభకు హాజరైన ప్రజలను చూస్తుంటే తమ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు ఖాయమని, ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి, ప్రజా ఎజెండా గెలవాలని అన్నారు. ఈసారి కూడా ప్రజలు దీవించి టీఆర్ఎస్ ను గెలిపిస్తే రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళతానని, సంక్షేమ పథకాలు కొనసాగిస్తానని అన్నారు.
kcr
TRS
mahabubnagar
kodangal
kosgi

More Telugu News