congress: కాంగ్రెస్, టీడీపీ వాళ్లు ఏ మొఖం పెట్టుకుని ఇక్కడ ఓట్లు అడుగుతున్నారు?: సీఎం కేసీఆర్

  • ఆలంపూర్ బిడ్డలు తమ పౌరుషం చూపించాలి
  • మన హక్కులు కాపాడుకోవాలి
  • ఆర్డీఎస్ ను నాశనం చేసిన దుర్మార్గులకు బుద్ధి చెప్పాలి

కాంగ్రెస్, టీడీపీ వాళ్లు ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆలంపూర్ లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, నాడు ఆర్డీఎస్ కెనాల్ విషయంలో వీళ్లు ఏం చేశారో ప్రజలు ఒకసారి గుర్తుతెచ్చుకోవాలని అన్నారు. 'తెలుగుదేశం మద్దతుతో కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఓట్లు అడుగుతారా? ఆలంపూర్ బిడ్డలు తమ పౌరుషం చూపించాలి, మన హక్కులు కాపాడుకోవాలి' అని పిలుపు నిచ్చారు. ఆర్డీఎస్ కాలువ నాశనం చేసిన దుర్మార్గులకు బుద్ధి చెప్పాలంటే, ఆలంపూర్ లో తమ అభ్యర్థి అబ్రహాంను లక్ష మెజార్టీతో గెలిపించాలని, అప్పుడే, మనకు పౌరుషం ఉన్నట్టు లెక్క అని అన్నారు.

‘నేను చచ్చినా సరే, ఎవరికీ భయపడను. వంద శాతం ఆర్డీఎస్ కింద మనకు అలాట్ మెంట్ ఉన్న నీళ్లు 15.9 టీఎంసీలు. ఒకటి తక్కువ 16 టీఎంసీలు. ఈ పదహారు టీఎంసీల నీళ్లు లక్షా అరవై వేల ఎకరాలకు పారాలి. ఈ లెక్క సీడబ్ల్యూసీ చెప్పే లెక్క. ఇప్పటిదాకా ఆర్డీఎస్ కెనాల్ కింద 85 వేల 500 ఎకరాలకు నీరు పారింది. నేను ప్రామీస్ చేస్తున్నా.. ఇంకో నలభై, యాభై వేల ఎకరాలకు నీళ్లిచ్చే బాధ్యత నాది’ అని చెప్పారు.

More Telugu News