kcr: ఓటు వేసే ముందు మంచీ చెడు ఆలోచించండి: సీఎం కేసీఆర్

  • సమైక్యపాలనలో రైతాంగం దెబ్బతింది
  • మంచినీళ్లు, తాగునీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు
  • మా హయాంలో రైతులకు మేలు చేశాం

ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. ఆలంపూర్ లో జరుగుతున్న టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఓటు వేసే ముందు మంచీ చెడు ఆలోచించి ప్రజలు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. గత పాలకుల హయాంలో తెలంగాణలో విద్యుత్ సరఫరా ఎలా ఉందో, టీఆర్ఎస్ హయాంలో ఎలా ఉందో ఆలోచించాలని, అదే విధంగా, పింఛన్లు, సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయో కూడా పోల్చి చూసుకోవాలని అన్నారు. సమైక్యపాలనలో రైతాంగం దెబ్బతిందని, తమ హయాంలో రైతులకు మేలు చేశామని చెప్పారు. నాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభించిననాడు జోగులాంబ ఆలయంలో మొక్కి ఇక్కడ నుంచే బయలుదేరిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మంచినీళ్లు, తాగునీళ్లు ఇవ్వకుండా సమైక్యపాలనలో ప్రజలను ఇబ్బంది పెట్టిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

More Telugu News