venkatesh: సంక్రాంతికి ముస్తాబవుతోన్న 'ఎఫ్ 2'

  • ముగింపు దశలో 'ఎఫ్ 2'
  • ఆద్యంతం వినోదభరితం 
  • హిట్ ఖాయమన్న దిల్ రాజు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' సినిమా రూపొందింది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా ఈ సినిమా నిర్మితమైంది. వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ నటించారు. ఈ సినిమాకి సంబంధించిన పనులు ముగింపు దశకి చేరుకున్నాయి. రేపటి నుంచి వరుసగా ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వడానికి టీమ్ రెడీ అవుతోంది.

దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ సినిమాను అనిల్ రావిపూడి ఆద్యంతం వినోదభరితంగా మలిచినట్టుగా తెలుస్తోంది. సినిమా మొత్తంలో ఎక్కడా కూడా ఒక్క ఫైట్ కూడా ఉండదని అంటున్నారు. రీసెంట్ గా ఈ సినిమా అవుట్ పుట్ చూసిన దిల్ రాజు, చాలా హ్యాపీగా ఫీలయ్యారట. సంక్రాంతికి సరైన సినిమా ఇదేననీ .. ఈసారి హిట్ పడటం ఖాయమనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ఏ స్థాయిలో సందడి చేస్తుందో చూడాలి మరి. 

More Telugu News