kcr: చార్మినార్ దగ్గరకెళ్లి ‘నేనే ముఖ్యమంత్రిని’ అని కేసీఆర్ చెప్పగలడా?: సీపీఐ నేత నారాయణ

  • ‘పాతబస్తీకి నేనే అధిపతిని’ అని కేసీఆర్ చెప్పగలడా?
  • కేసీఆర్ కు సిగ్గుంటే కనుక అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించాలి
  • నాడు ‘మెట్రో’కు కేసీఆర్ వ్యతిరేకం

పాత బస్తీతో సహా ఈ రాష్ట్రానికి కేసీఆర్ నిజంగా ముఖ్యమంత్రి అయితే, ఆయనకు ధైర్యం ఉంటే.. చార్మినార్ దగ్గరకెళ్లి ‘నేనే ముఖ్యమంత్రిని’ అని, ‘పాతబస్తీకి నేనే అధిపతిని’ అని చెప్పగలడా? అని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో నిర్వహించిన ప్రజాకూటమి ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా తమ కాళ్ల దగ్గర ఉండాల్సిందేనని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అన్నాడని, కేసీఆర్ కు సిగ్గుంటే కనుక, ఈ వ్యాఖ్యలను ఖండించాలని అన్నారు.

ఓల్డ్ సిటీకి ‘మెట్రో’ వస్తుందనే కేటీఆర్ చెబుతున్నారని, ఇంతవరకూ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ‘మెట్రో’కు ఓల్డ్ సిటీలో వాళ్లు వ్యతిరేకమని అన్నారు. ఇప్పుడేమో, ఓల్డ్ సిటీకి కూడా ‘మెట్రో’ వస్తుందని చెబుతున్నారని, ఎందుకంటే, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచేది లేదు కనుక అని విమర్శించారు. నాడు ‘మెట్రో’కు కేసీఆర్ వ్యతిరేకమని, నేడు ‘మెట్రో’కు ఎంఐఎం వ్యతిరేకమని, వీళ్లా హైదరాబాద్ సిటీని పెంచిపోషించేది, బాగు చేసేది? అంటూ ఆయన దుయ్యబట్టారు. 

More Telugu News