balakrishna: 'కథానాయకుడు'లో 11 పాటలు ఉంటాయట!

  • ప్రత్యేక ఆకర్షణగా కీరవాణి సంగీతం 
  • ముఖ్య పాత్రల్లో క్రేజీ ఆర్టిస్టులు 
  • సంక్రాంతి కానుకగా విడుదల  

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతోంది. ఈ బయోపిక్ 'కథానాయకుడు' .. 'మహానాయకుడు' అనే రెండు భాగాలుగా నిర్మితమవుతోంది. సంక్రాంతి కానుకగా 'కథానాయకుడు'ను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ సినిమా ప్రయాణానికి సంబంధించిన విశేషాల సమాహారంగా ఈ భాగం కొనసాగుతుంది.

'కథానాయకుడు'లో మొత్తం 11 పాటలు ఉంటాయట. కథలోభాగంగా కలిసిపోయి కనువిందు చేయడం వలన ప్రేక్షకులకు పాటలు ఎక్కువైపోయాయి అనే ఫీలింగ్ ఎంతమాత్రం రాదని అంటున్నారు. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. రానా .. సుమంత్ .. కల్యాణ్ రామ్ .. రకుల్ .. నిత్యామీనన్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. నందమూరి అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.   

  • Loading...

More Telugu News