రేవంత్ రెడ్డికి షాక్.. కేసు నమోదుచేసిన కొడంగల్ పోలీసులు!
- కేసీఆర్ ను రేపటి సభకు రానివ్వబోమన్న రేవంత్
- ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్
- చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశం
కేసీఆర్ ను కొడంగల్ లో అడుగుపెట్టకుండా అడ్డుకుంటామని రేవంత్ ప్రకటించడంతో టీఆర్ఎస్ ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను సమర్పించింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించింది. దీంతో కొడంగల్ పోలీసులు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.