nani: విక్రమ్ కుమార్ తో నాని .. షూటింగ్ డేట్ ఖరారు

  • నాని 24వ సినిమాకి రంగం సిద్ధం 
  • మైత్రీ మూవీస్ పై నిర్మాణం 
  • ఫిబ్రవరి 19న షూటింగ్ మొదలు

ప్రస్తుతం నాని క్రికెట్ నేపథ్యంలో సాగే 'జెర్సీ' సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన క్రికెటర్ గా కనిపించనున్నాడు. అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే నాని .. దర్శకుడు విక్రమ్ కుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు .. ఇది నానికి 24వ సినిమా. ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

నాని .. విక్రమ్ కుమార్ ఒక గోడపై కూర్చుని మాట్లాడుకుంటున్నట్టుగా ఈ పోస్టర్ వుంది. ఫిబ్రవరి 19వ తేదీన ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనే విషయాన్ని కూడా ఈ పోస్టర్ ద్వారానే ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇది తన కెరియర్లో డిఫరెంట్ మూవీ అవుతుందని నాని భావిస్తున్నాడు. విక్రమ్ కుమార్ ఈ కథపై గట్టి కసరత్తే చేశాడని చెప్పుకుంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.  

More Telugu News