anitha: 250 కిలోమీటర్ల మేర పాదయాత్రను చేపట్టనున్న టీడీపీ ఎమ్మెల్యే అనిత

  • 'మీ కోసం - మీ ఆడపడుచు' పేరుతో పాదయాత్ర
  • అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకే పాదయాత్ర అన్న అనిత
  • త్వరలోనే రూట్ మ్యాప్, షెడ్యూల్ విడుదల
టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గంలో 'మీ కోసం - మీ ఆడపడుచు' పేరుతో పాదయాత్రను నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. ఈనెల 24న పాదయాత్ర ప్రారంభమవుతుందని... నాలుగు మండలాల్లోని 80 పంచాయతీల్లో సుమారు 250 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు.

నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఈ నాలుగున్నరేళ్లలో చేశానని... తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకే పాదయాత్రను చేయనున్నానని తెలిపారు. అన్ని గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కరినీ కలుస్తానని చెప్పారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. త్వరలోనే పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్, షెడ్యూల్ ను విడుదల చేస్తామని చెప్పారు.
anitha
Telugudesam
padayatra
Chandrababu

More Telugu News